ఢిల్లీ లిక్కర్ కేసు: ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశే

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-20 06:16:35.0  )
ఢిల్లీ లిక్కర్ కేసు: ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశే
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్‌కు సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేయగా.. శుక్రవారం లోపు కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి 23వ తేదీ వరకూ సమయం ఇచ్చింది. వచ్చే మంగళవారం(ఆగస్టు 27) బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. కాగా, ముందుగా బెయిల్ ఇవ్వాలని కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ కోర్టు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గత మార్చి 15న కవితను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో నేరుగా ఢిల్లీలోని తీహార్ జైలుకు ఆమెను తరలించారు.

Advertisement

Next Story

Most Viewed

    null