బియ్యం సేకరణలో జాప్యం.. జిల్లా అధికారుల్లో నిర్లక్ష్యం

by sudharani |   ( Updated:2023-03-04 15:41:22.0  )
బియ్యం సేకరణలో జాప్యం.. జిల్లా అధికారుల్లో నిర్లక్ష్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ నుంచి సహకారం లేకపోవడంతో పాటు జిల్లా అధికారుల నిర్లక్ష్యం అలస్థత్వం వల్ల మిల్లర్ల నుంచి బియ్యం సేకరణలో జాప్యం జరుగుతోందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ అసంతృప్తిని వ్యక్తం చేశారు. శనివారం పౌరసరఫరాల కార్యాలయంలో ఛైర్మన్‌ 33 జిల్లా మేనేజర్లతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఛైర్మన్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈ నెల 31వ తేదీలోగా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి రైసు మిల్లర్లు సీఎంఆర్‌ను అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఖరీఫ్‌కు గడువు పొడిగించలేదని, కేవలం రబీకి మాత్రమే మార్చి31 వరకు గడువు పొడిగించారని భవిష్యత్‌లో గడువు పెంచుతారనే నమ్మకలేదని దీన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరితగతిన మిల్లర్ల నుంచి సీఎంఆర్‌ సేకరించాలని అదేశించారు. సమయం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో రోజుకు 50 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అప్పగిస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటామని అన్నారు. బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వడంలో ఇబ్బంది ఏమిటి? మిల్లర్లు ఎఫ్‌సీఐకి బియ్యం ఇవ్వకపోతే మీరేం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు.

సూర్యపేటలో 95 వేల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ రైస్‌ ఎఫ్‌సీఐకి అప్పగించవలసి ఉండగా ఇప్పటి వరకు కేవలం 31వేలు మాత్రమే అప్పగించడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. వచ్చే వారంలో వనపర్తి, సూర్యాపేట జిల్లా అధికారులకు ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తమన్నారు. సమస్యల సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేయకుండా కార్పోరేషన్‌పై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా సరైన పద్ధతిలో పనిచేయాలని అధికారులకు హితబోధ చేశారు.

అందుబాటులోకి పౌరసరఫరాల పెట్రోల్‌ బంక్‌

పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కవాడీగూడలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంక్‌ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 33 పెట్రోల్‌ బంక్‌లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో తొలివిడతగా కవాడిగూడలో ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ తొలి వినియోగదారునిగా తన వాహనంలో డీజిల్‌ పోయించుకున్నారు.

Also Read...

9న తెలంగాణ కేబినెట్ సమావేశం.. చర్చించే అంశాలివే!

Advertisement

Next Story