ముగిసిన గ్రాడ్యుయేట్ MLC నామినేషన్ ఉపసంహరణ గడువు

by GSrikanth |
ముగిసిన గ్రాడ్యుయేట్ MLC నామినేషన్ ఉపసంహరణ గడువు
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నామినేషన్ ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. మే 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించగా.. ఈ 13వ తేదీ వరకు నామినేషన్‌ను ఉపసంహరించుకునేందుకు గడువు విధించారు. తాజాగా గడువు ముగియడంతో అభ్యర్థులు పోలింగ్‌పై దృష్టి పెట్టారు. ఈనెల 27న పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. వచ్చే నెల 5వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉండనుంది. అయితే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైన పళ్ళ రాజేశ్వర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జనగామా ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా, ఈ నియోజకవర్గంలో 4,61,806 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Advertisement

Next Story