- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఇది బీసీలకు దక్కిన గౌరవం: దానం నాగేందర్
దిశ, వెబ్‌డెస్క్: మహేశ్‌కుమార్ గౌడ్‌కు పీసీసీ దక్కడం చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఇది తెలంగాణలో బీసీలకు దక్కిన గౌరవమని, బీసీలంతా ఏకతాటిపైకొచ్చి మహేశ్ గౌడ్ నాయకత్వాన్ని సమర్థించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన మహేశ్‌కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం మరి కొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణనను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ మహేశ్‌కుమార్ గౌడ్‌ను పీసీసీగా ఎంపిక చేసిందని, కాంగ్రెస్ కార్యకర్తలకు ఇది స్ఫూర్తినిచ్చే నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.
రాహుల్‌గాంధీ ఆశయం కూడా ఇదేనని, దేశంలోని బీసీలంతా ఐక్యంగా ఉండాలని ఆయన భావిస్తారని, ఆయన ఆశయాలకు అనుగుణంగానే నేడు తెలంగాణలో పీసీసీ పదవి ఓ బీసీకి దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. బలహీన వర్గమైన బీసీకి చెందిన మహేశ్‌కుమార్ గౌడ్ ఎన్‌ఎస్‌యూఐ నుంచి ఇప్పుడు పీసీసీ వరకు ఎదిగారని, కష్టపడ్డ కార్యకర్తలకు పార్టీలో కచ్చితంగా గుర్తింపు ఉంటుందనే విషయం ఈ పరిణామంతోనే అర్థం చేసుకోవచ్చని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పీసీసీగా ఎంపికైన మహేశ్ కుమార్ గౌడ్ మరికొద్ది సేపట్లో గాంధీభవన్ వేదికగా జరగనున్న కార్యక్రమంలో పదవీ బాధ్యతలను చేపట్టబోతున్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి నుంచి ఆయన ఈ బాధ్యతలను అందుకోనున్నారు.