Cyber Crimes : ‘కుటుంబ సర్వే’ సైబర్ మోసాలు! సైబర్ క్రైమ్ పోలీసుల కీలక సూచనలు

by Ramesh N |
Cyber Crimes : ‘కుటుంబ సర్వే’ సైబర్ మోసాలు! సైబర్ క్రైమ్ పోలీసుల కీలక సూచనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో (Congress Govt) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా (family survey) సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించిన సంగతి తెలిసిందే. నవంబర్ 6 నుంచి ప్రారంభం కావాల్సిన ఉన్నప్పటికీ.. ఇండ్లకు స్టిక్కరింగ్ ప్రక్రియ మాత్రమే ముగిసింది. అధికారికంగా నేటి నుంచి సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ వ్యక్తిగత వివరాలను ఇంటింటికి తిరిగి అధికారులు సేకరిస్తారు. అయితే ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు (Cyber Crimes) మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

ఈ మేరకు ఎక్స్ వేదికగా శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆసక్తికర ట్వీట్ చేశారు. కుటుంబ సర్వే అంటూ సైబర్ నేరగాళ్ల మోసాలకు పాల్పడుతారని, కుటుంబ సర్వే చేస్తున్నామంటూ సైబర్ నేరగాళ్లు ఫ్రాడ్ లింక్స్ పంపిస్తున్నారని తెలిపారు. ఆ లింక్ క్లిక్ చేస్తే వారి ఖాతాల్లో ఉన్న డబ్బులు మాయం.. అలానే కుటుంబ సర్వే ఓటీపీ వస్తుందని, చెప్పండి అంటూ ఫోన్ చేసి అడుగుతున్నారన్నారు. కాబట్టి సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త ఉండాలని (Cyber Crimes PS Hyd City Police) సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది.

Next Story

Most Viewed