- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైండ్ స్పేస్ జంక్షన్ దాటడం ఒక సవాల్: ఎన్వీఎస్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో విస్తరణ పనుల ప్రక్రియను వేగవంతం చేయడంపై అధికారులు దృష్టి సారించారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రూట్ మ్యాప్ ను తాజాగా ఇంజినీర్లు పరిశీలించారు. శనివారం హైదారాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇంజినీర్ అడ్వయిజర్, రైల్వే బోర్డు మాజీ సభ్యుడు ఈ రూట్ మ్యాప్ ను పరిశీలించారు. ఇప్పటికే పలు దఫాలుగా ఈ రూట్ కు సంబంధించి పరిశీలనులు చేసిన అధికారులు తాజాగా మరోసారి తనిఖీ చేపట్టారు.
ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ రాయదుర్గం స్టేషన్ నుంచి నానక్ రామ్ గూడ జంక్షన్ వరకు మార్గం చాలా క్లిష్టతరమైనదని అన్నారు. 21 మీటర్ల ఎత్తులో మైండ్ స్పేస్ జంక్షన్ ను దాటడం ఒక పెద్ద సవాల్ అన్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద అండర్ పాస్, మధ్యలో రోటరీ, పైన ఫ్లై ఓవర్ ఒకదాని మీద ఒకటి ఉన్నాయని చెప్పారు. మూడు అడ్డంకులను దాటేందుకు ప్రత్యేక స్పాన్ నిర్మాణం చేస్తామని, ఉత్తమమైన ఇంజినీరింగ్ పరిష్కారాలను సూచించేందుకే తనిఖీలు చేశామని చెప్పారు.