Crime News: ఫోన్ మాట్లాడుతూ.. అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య!

by Geesa Chandu |   ( Updated:2024-09-14 15:58:36.0  )
Crime News: ఫోన్ మాట్లాడుతూ.. అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య!
X

దిశ, వెబ్ డెస్క్: అనుమానాస్పద స్థితిలో అపార్ట్మెంట్ ఐదవ అంతస్తు నుంచి దూకి, ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాంనగర్ లోని హరినగర్ ప్రాంతానికి చెందిన ముజామిల్ బేగ్ కుమార్తె సనా బేగం(26) భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. శనివారం మధ్యాహ్నం రాంనగర్ నుంచి విఎస్టి మార్గంలో ఉన్న గిరిశిఖర అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో ఉన్న బ్యాంక్ వద్దకు సనా బేగం వచ్చింది. అక్కడ పైన ఉన్న రెసిడెన్షియల్ ఫ్లాట్ లో తమకు తెలిసిన వారు ఉన్నారని చెప్పి ఐదవ అంతస్తుకు చేరుకుంది. ఆమెను చూడగానే సెక్యూరిటీ గార్డ్ ఎవరమ్మ నీవు పైనేం చేస్తున్నావ్ అని అడుగుతుండగానే.. ఆమె ఒక్కసారిగా కిందకు దూకింది. ఐదవ అంతస్తు నుంచి పడిన సనా తలకు దెబ్బ తగిలి తీవ్ర రక్తస్రావం జరగడంతో అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి ఇన్స్ పెక్టర్ సీతయ్య, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకున్నారు. సనా బేగం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story