పెంచిన ఇంజినీరింగ్‌ ఫీజులను తగ్గించాలి: CPI

by GSrikanth |
పెంచిన ఇంజినీరింగ్‌ ఫీజులను తగ్గించాలి: CPI
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పెంచిన ఇంజినీరింగ్‌ ఫీజులను తగ్గించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్ ఫీజులు తగ్గించాలని ఉన్నత విద్యామండలి వద్ద ఎఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సమస్య పరిష్కారం కోసం నిరసన తెలియజేస్తున్న విద్యార్థులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. అరెస్టు చేసిన విద్యార్థులను తక్షణమే విడుదల డిమాండ్‌ చేశారు. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో పెంచిన అధిక ఫీజులను తగ్గించాలని, అన్ని కళాశాలలో ఒకే రకమైన ఫీజులు తీసుకోవాలన్నారు. కళాశాల్లో కావలసిన మౌలిక వసతులకు మించి సీట్లకు అనుమతిచ్చి ఫీజులు పెంచుతున్నారని ఆరోపించారు. ఇంజినీరింగ్‌ బీ-కేటగిరీ సీట్లను ప్రభుత్వమే కౌన్సిలింగ్‌ ద్వారా భర్తీ చేయాలని, యూనివర్శిటీ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును రద్దు చేయాలని, ప్రభుత్వ డిగ్రీ అండ్‌ పిజీ కళాశాలలో కోర్సుల ఎత్తివేతను తక్షణమే విరమించుకోవాలని కూనంనేని ఉన్నత విద్యా మండలిని డిమాండ్‌ చేశారు.

Advertisement

Next Story

Most Viewed