- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీ తరహాలో ఇక్కడ కూడా వారిపై చర్యలు తీసుకోండి.. ప్రభుత్వానికి CPI ఎమ్మెల్యే కూనంనేని సూచన

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) కీలక నేత, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) సస్పెన్షన్‌పై CPI ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు(Kunamneni Sambasiva Rao) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ(Telangana Assembly)లో స్పీకర్ చైర్‌కు అందరూ గౌరవం ఇచ్చి తీరాల్సిందే అన్నారు. సభలో సభ్యులు కూడా ఆచితూచి మాట్లాడాలని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై పునరాలోచించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. సోషల్ మీడియాలో పోస్టులపై ఆంధ్రప్రదేశ్‌లో చర్యలు తీసుకుంటున్నారు.. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లపై వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణ మురళి, వల్లభనేని వంశీపై చర్యలు తీసుకున్నారు.. తెలంగాణలోనూ ఇదే తరహాలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అప్పుడే సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు చేసే వారు కాస్త కంట్రోల్‌లో ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (BRS MLA Jagadish Reddy) శాసన సభ నుంచి సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad) ఉత్తర్వులు జారీ చేశారు. ‘మీరు మేము ఎన్నకుంటేనే స్పీకర్ అయ్యారు. సభ మీ ఒక్కరిదీ కాదు - సభ అందరదీ’ అని స్పీకర్‌ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి అన్నారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేసినా జగదీష్ రెడ్డి సారీ చెప్పకపోవడంతో సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.