అక్కడ ఎయిర్ పోర్టు నిర్మాణం సాధ్యం కాదు.. కాంగ్రెస్ ఎంపీకి కేంద్రమంత్రి లేఖ

by Ramesh Goud |
అక్కడ ఎయిర్ పోర్టు నిర్మాణం సాధ్యం కాదు.. కాంగ్రెస్ ఎంపీకి కేంద్రమంత్రి లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: రామగుండంలో ఎయిర్‌పోర్టు పెట్టాలనే అంశంపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు (Pedhapalli MP Vamshi Krishna) కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు (Union Minister Kinjarapu Ram Mohan Naidu) లేఖ (Letter) రాశాడు. పెద్దపల్లిలోని రామగుండంలో (Ramagundam) ఎయిర్ పోర్ట్ (Airport) నిర్మాణం సాధ్యం కాదని లేఖలో పేర్కొన్నారు. కొండప్రాంతాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎయిర్‌పోర్ట్ నిర్మాణం సాధ్యం కాదని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (Airport Authority Of India) తెలిపినట్లు లేఖ ద్వారా తెలియజేశారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో డొమెస్టిక్ ఎయిర్ పోర్టును (Domestic Airport) ఏర్పాటు చేయాలని గత సంవత్సరం నవంబర్ లో కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ ప్రతిపాధన పెట్టారు. దీనిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం ఉన్న బసంత్‌నగర్ విమానాశ్రయం (రామగుండం) మోన్-ఆపరేషనల్ ఎయిర్‌పోర్ట్ అని, అక్కడ చిన్న హెలిప్యాడ్ తప్ప మరే మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవు అని తెలిపారు. బసంత్‌నగర్ విమానాశ్రయం అభివృద్ధి కోసం సర్వే చేసినట్లు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలియజేసిందని, ఈ సర్వే ఆధారంగా బసంత్ నగర్ విమానాశ్రయం చుట్టూ ఎత్తైన కొండలు అడ్డంకిగా ఉన్న కారణంగా అభివృద్ధి సాధ్యపడకపోవచ్చని ఎఏఐ తెలియజేసిందని అన్నారు.అలాగే ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) యొక్క నిరోధిత గగనతలంలో ఉందని, ఎయిర్ ఫోర్స్ అకాడమీ ద్వారా ఫ్లయింగ్ శిక్షణ కోసం విస్తృతంగా ఉపయోగించబడుతుందని, దీనికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ నుండి క్లియరెన్స్ అవసరమని చెప్పారు.

ఇక భారత ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ (GFA) పాలసీ, 2008ని కూడా రూపొందించిందని, ఇది దేశంలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు మార్గదర్శకాలు, ప్రక్రియను అందిస్తుందని తెలిపారు. ఈ పాలసీ ప్రకారం ఏదైనా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే, వారు తగిన స్థలాన్ని గుర్తించి, విమానాశ్రయ నిర్మాణానికి ముందస్తు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి, 'సైట్ క్లియరెన్స్' కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించి, సూత్రప్రాయంగా ఆమోదం పొందాలి అని తెలిపారు. జీఎఫ్ఏ పాలసీ ప్రకారం, విమానాయాన మంత్రిత్వ శాఖకు రామగుండంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన ఏదైనా విమానాశ్రయ డెవలపర్, రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చినప్పుడు.. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ పాలసీ-2008లోని నిబంధనల ప్రకారం పరిగణించబడుతుందని కేంద్రమంత్రి లేఖలో రాసుకొచ్చారు.

Next Story

Most Viewed