- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంపు భూముల్లో పార్కు నిర్మాణం.. ఫిర్యాదులు వెళ్లినా ఆఫీసర్స్ సైలెంట్
దిశ, లక్షెట్టిపేట: ప్రాజెక్టు ముంపు భూముల్లో పార్కు నిర్మాణాన్ని చేపట్టి ప్రజాధనాన్ని గోదావరి పాలు చేస్తున్న వైనమిది. సంబంధిత ప్రాజెక్ట్ అధికారుల ఎన్ఓసీ, రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండా ప్రభుత్వ నిధులు రూ.65 లక్షలు కేటాయించి పనులు ప్రారంభించడం విమర్శలకు తావిస్తోంది. లక్షెట్టిపేట పురపాలక సంఘ పరిధిలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు భూముల్లో ఈ పార్కు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా స్పందన రాకపోవడం శోచనీయం.
అసలేం జరుగుతోంది..
లక్షెట్టిపేట పురపాలక సంఘ పరిధిలో పట్టణానికి దూరంగా రెండు కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపు భూములను గుర్తించి సంబంధిత భూ బాధితులకు రైతులకు నష్ట పరిహారం సైతం అందజేశారు. అయితే గోదావరి ఒడ్డున ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్థలాన్ని మున్సిపల్ అధికారులు ఎంపిక చేశారు. యేడాది క్రితం మున్సిపల్ కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. ఈ మేరకు టీఎస్ఎఫ్ఐడీసీ, పట్టణ ప్రగతి నిధులు కలిపి నిధులను కేటాయించారు. టెండర్లు దక్కించుకున్న సంబంధిత కాంట్రాక్టర్ ఇటీవల పార్క్ నిర్మాణ పనులు ప్రారంభించారు. నిర్మాణం చేపట్టిన స్థలం గోదావరిలో వరదలు వస్తే ముంపునకు గురవుతుంది. పార్కులో పనులకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఈ స్థలంలో పార్క్ నిర్మాణం చేపట్టి ప్రజాధనం వృధా చేయడమేననే విమర్శలు వెలువెత్తుతున్నాయి.
కానరాని అనుమతులు..
పార్కు నిర్మాణానికి సంబంధిత ప్రాజెక్ట్ అథారిటీ నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఎలాంటి పర్మిషన్ లేదు. ఆ అధికారుల నుంచి ఎన్వోసి వచ్చిన అనంతరం రెవెన్యూ అధికారుల ద్వారా స్థల కేటాయింపులు జరగాలి. అలాంటి అనుమతులు ఏవి లేకుండా కౌన్సిల్‌లో తీర్మానం చేసి టెండర్లు పిలిచారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రారంభించారు. సంబంధిత శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ముంపు భూముల్లో పార్కు నిర్మాణ చేపట్టి ప్రజాధనం వృథా చేయడమేనని స్థానికులు అంటున్నారు.
క్రీడా ప్రాంగణం లేనట్లేనా..?
పార్కు నిర్మాణం జరుగుతున్న భూముల్లోనే యేడాది కిందట తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. సుమారు రూ. 4 లక్షల ప్రభుత్వ నిధులను వెచ్చించారు. ప్రాంగణానికి సంబంధించిన స్థలాన్ని సైతం కలుపుకొని పార్కు నిర్మాణం చేస్తున్నారు. మరి ప్రభుత్వ నిధులు వెచ్చించి క్రీడా ప్రాంగణాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్లనే ప్రశ్న తలెత్తుతోంది. అక్కడ క్రీడా ప్రాంగణాన్ని ఎత్తేసినట్లేనని తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు ప్రాజెక్టు ముంపు భూములు నిర్మిస్తున్న పార్కు పనులపై దృష్టి సారించి ప్రజాధనం వృధా కాకుండా తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.