- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR : అసెంబ్లీలో కాంగ్రెస్ ను నిలదీస్తాం : కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ఎల్పీ(BRSLP) సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పార్టీలోని ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మీడియాతో మాట్లాడుతూ.. రానున్న శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు కేసీఆర్ దిశానిర్ధేశం చేసినట్టు పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ అరకొరగా చేశారని, రైతుభరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండి పడ్డారు. దళిత, గిరిజన బిడ్డలకు తాము అండగా ఉంటామని పేర్కొన్న కేటీఆర్.. గిరిజన స్కూళ్లల్లో జరుగుతున్న మరణాలపై మాట్లాడేందుకు వెళ్తున్న తమ నాయకులపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. అసెంబ్లీ, మండలి సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని.. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని నిద్ర పోనివ్వమని తెలియ జేశారు.
- Tags
- Ktrbrs