- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాలో.. ప్లీజ్ ఓట్ ఫర్ కాంగ్రెస్: రెడీ అవుతున్న కాంగ్రెస్ టెలీ కాలర్స్ టీమ్
దిశ, తెలంగాణ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ఎన్నికల మూడ్ లోకి వచ్చేసింది. ప్రజల మద్ధతును కోరేందుకు వివిధ రకాల ప్రయత్నాలతో ముందుకు వెళ్తున్నది. దీనిలో భాగంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లను విరివిగా వాడనున్నది. ఇప్పటికే ప్రచారం కోసం సోషల్ మీడియా వేదికలను వేగంగా వాడుతుండగా.. ఓటర్లతో నేరుగా మాట్లాడేందుకు టెలీ కాలర్స్ విధానాన్ని ప్రారంభించనున్నారు.‘హాలో.. ప్లీజ్ ఓట్ ఫర్ కాంగ్రెస్’అనే స్లోగన్ తో ఓటర్లతో మాట్లాడనున్నారు.ఈ మేరకు కాంగ్రెస్‌పార్టీ ప్రత్యేకంగా టెలీ కాలర్స్‌ను నియమించుకున్నది.ఓ ప్రైవేట్ ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇచ్చినట్లు సమాచారం.
ఓటర్లను ఆకట్టుకునే తీరుపై ఇందిరాభవన్ లో లో సదరు టెలీ కాలర్స్ కు ట్రైనింగ్ కూడా పూర్తయినట్లు తెలిసింది. జిల్లాకో కేంద్రం చొప్పున 33 జిల్లాల్లో కార్యాలయాలు ఓపెన్ చేయనున్నారు. అక్కడి నుంచే టెలీ కాలర్స్ ఆయా నియోజకవర్గాలకు చెందిన ఓటర్లతో నేరుగా మాట్లాడనున్నారు. ఈ టెలీ కాలర్స్టీమ్ లో 75 శాతం మంది మహిళలు ఉండగా,మరో 15 శాతం మంది పురుషులు ఉన్నారు. సోషల్ మీడియా టీమ్‌లతో సమన్వయమై ఈ కాలర్స్ టీమ్ పనిచేయనున్నది. అన్ని జిల్లాల టీమ్‌లను హైదరాబాద్ లో సెంట్రల్ ఆఫీస్నుంచి మానిటరింగ్ చేయనున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ఫోకస్..?
టెలీ కాలర్ విధానంలో కాంగ్రెస్ కు ఓటేయ్యమని కోరడమే కాకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను సైతం వివరించాలని టీమ్ప్లాన్చేసింది.9 ఏళ్లలో మోడీ, కేసీఆర్ఇచ్చిన హామీలు, అమలు కానీ విధానాలు వంటివాటిపై ఓటర్లకు అర్థమయ్యే రీతిలో చెప్పనున్నారు.అంతేగాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్‌లలో జరిగే అన్యాయం, మిస్టెక్స్, అవినీతిపై చెప్పనున్నారు.కర్ణాటక తరహాలో హామీలను నెరవేర్చేందుకు భరోసా కల్పించనున్నారు.యువత, రైతులు, మహిళలకు కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే అంశాలపై వివరించనున్నారు. ఒక్క ఛాన్స్అంటూ ఓటర్లను అభ్యర్ధించనున్నారు.
లీడర్ షిప్పై కూడా..
కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు మన రాష్ట్రంలోనూ కర్ణాటక తరహాలో విధానాలను ఇంప్లిమెంట్ చేయనున్నారు. దీంతోనే టీపీసీసీ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నది. అయితే టెలీ కాలర్స్ కు అనుసంధానంగా కొందరు పార్టీ కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో పనిచేయనున్నారు. ఈమేరకు యూత్ కాంగ్రెస్ నుంచి జిల్లాకు ఒక వ్యక్తిని ఎంపిక చేశారు. వీరితో పాటు స్టేట్ లెవల్ లో మరో టీమ్ పని చేస్తుంది. వీరందరికీ రేపటి నుంచి గాంధీభవన్‌లో వర్క్ షాప్ మొదలుకానున్నది.