- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎల్లుండి హైదరాబాద్‌కు AICC కీలక నేత.. చేరికలపై చర్చలు కొలిక్కి వచ్చే ఛాన్స్..!
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై దృష్టి సారించింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్‌లోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌కు రానున్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్ ఏర్పాట్లతో పాటు అగ్రనాయకుల పర్యటనలపై ఆయన రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు. ఇదే సమయంలో 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నది.
ఈ సభలోనే పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోబుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. తుమ్మలతో పాటు ఇతర పార్టీలకు చెందిన మరి కొంతమంది ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న తరుణంలో అన్ని కలిసి వస్తే వీరందరికి సోనియాగాంధీ సమక్షంలో కండువా కప్పేందుకు టీకాంగ్రెస్ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎల్లుండి కేసీ వేణుగోపాల్ పర్యటనలో చేరికలపై చర్చలు మరికొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.