చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య రూపాదేవి ఆత్మహత్య

by Mahesh |
చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య రూపాదేవి ఆత్మహత్య
X

దిశ, మేడ్చల్ బ్యూరో: చొప్పదండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎమ్మెల్యే సతీమణి అయిన రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌ లోని అల్వాల్‌ లోని పంచశీల కాలనీలోని తమ ఇంట్లో ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. రూపాదేవి గత రెండు రోజులుగా పాఠశాలకు వెళ్లడం లేదు. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే కుటుంబం ఇతర బంధువులతో కలిసి తిరుమల సహా మరికొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారు. రూపా మృతదేహాన్ని పోలీసులు కొంపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అలాగే ఎమ్మెల్యే భార్య ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఎమ్మెల్యే దంపతుల మధ్య గత కొంత కాలంగా విభేదాలు ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఆర్థిక కారణాలతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

భార్య ఆత్మహత్యతో బోరున విలపించిన ఎమ్మెల్యే (వీడియో)



Next Story