- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫస్ట్ టార్గెట్ కేసీఆర్.. ఎంపీ ఎన్నికల్లోపే కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..?
దిశ, డైనమిక్ బ్యూరో: గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు, లక్షల కోట్ల అవినీతి జరిగిందని టీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టుల నిర్మాణాలు, పేపర్‌లీకేజీలు, ధరణిలో అక్రమాలు, మీషన్ భగీరథ స్కామ్, విద్యుత్, సంక్షేమ పథకాల్లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగడంపై మొదట కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తర్వాత పేపర్ లీకేజీల వ్యవహారంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి కొత్త బోర్డు ఏర్పాటు చేసింది.
ఫామ్ హౌస్ నుంచే స్టార్ట్!
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల పైనే అప్పులు చేసిందని కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది తప్పుడు లెక్కలని బీఆర్ఎస్ పార్టీ గతంలోనే కొట్టేసింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతి బయట పెడుతామని కాంగ్రెస్ గతం నుంచే చెబుతుంది. అయితే ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచే మొదలు పెట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గత పాలనలో కేసీఆర్ అవినీతి చేశారని, బయట పెట్టేందుకు కాంగ్రెస్ భారీ స్కెచ్ వేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ నేత మధుయాష్కీ మాట్లాడారు. త్వరలోనే కేసీఆర్ ఫామ్ హౌస్‌పై విచారణ చేసి అవినీతి వెలికితీస్తామని హెచ్చరించారు. దీంతో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది.
ఎంపీ ఎన్నికల ముందే స్ట్రోక్ ఇవ్వనున్నారా?
ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని పొలిటికల్ టాక్ నడుస్తోంది. కాగా, కేసీఆర్ అవినీతి వెలికి తీసేందుకు ఈ ఎంపీ ఎన్నికలలోపే ప్రజల ముందుకు తీసుకురావాలని టీ కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.