- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కలెక్టర్ కాళ్లు మొక్కిన కాంగ్రెస్ నేత.. ఎందుకోసమంటే..?
దిశ, డైనమిక్ బ్యూరో: వడగళ్ల వానలతో కరీంనగర్ రైతులు తీవ్రంగా నష్టపోయారని.. వారిని తక్షణమే ఆదుకోవాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి కలెక్టర్ కాళ్లపై పడ్డారు. ఈ ఘటనతో కలెక్టర్ ఒక్కసారి దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘వ్యవసాయ క్షేత్రాల్లో పంట నష్టం, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొట్టుకుపోయింది. వాటిని పరిశీలించేందుకు వస్తున్న నేతల ముందు రైతులు కన్నీళ్లు పెట్టుకోవడమే కాదు, తమను ఆదుకోవాలని కాళ్ళపై పడుతున్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకోండి’ అంటూ కృష్ణారెడ్డి కలెక్టర్ ముందు మోకాళ్ళపై కూర్చుండిపోయారు. నష్టపోయిన పంటలకు పరిహారం ఇప్పించాలని, జిల్లాలో రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు రావాలని, రైతులకు భరోసా కల్పించాలని ఆయన కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.