KTR వ్యాఖ్యలు రాజకీయ అవివేకానికి నిదర్శనం

by GSrikanth |
KTR వ్యాఖ్యలు రాజకీయ అవివేకానికి నిదర్శనం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత మల్లు రవి తీవ్ర విమర్శలు చేశారు. గురువారం మల్లు రవి మీడియాతో మాట్లడారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని చూస్తుంటే బీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందని అన్నారు.

అందుకే ప్రభుత్వంపై అడ్డుగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పులను ఒప్పుకొని ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు. లేదంటే జనం బీఆర్ఎస్‌ను బొంద పెడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన ప్రజలు.. పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed