టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాల్సిందే

by GSrikanth |   ( Updated:2023-10-13 07:26:36.0  )
టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాల్సిందే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈనెల 14న జరగబోయే సడక్ బంద్‌‌ను విజయవంతం చేయాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి పిలుపునిచ్చారు. సడక్ బంద్‌లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న టీఎస్సీఎస్సీని ప్రక్షాళన చేయాలని, కొత్త కమిషన్ నియమించాలని, డీఎస్సీ పోస్టులను పెంచాలని, పరీక్షల రద్దు వల్ల నష్టం జరిగిన అభ్యర్థులకు మూడు లక్షలు చెల్లించాలనే డిమాండ్లతో రాస్తారోకోకు అఖిల పక్ష పార్టీలు పిలుపునిచ్చాయని ఇవాళ ఒక ప్రకటనలో వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ముఖ్యమైన రహదారుల్లో సడక్ బంద్ చేయాలని నిరుద్యోగులు, శ్రేణులకు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story