- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీలో హైకమాండ్‌ను మించిన తోపులు ఎవరూ లేరు.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: పార్టీలో చేరికలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం జగ్గారెడ్డి, కోదండ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ. ఎవరు పార్టీలో చేరినా చేర్చుకోవాలని ఏఐసీసీ ఆదేశించిందని చెప్పారు. పార్టీ అభ్యర్థికి నష్టం చేసినవాళ్ళు అయినా.. చేర్చుకోవాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. నాయకులు ఎవరు నారాజ్ కావద్దు.. కలిసి పని చేయాల్సిందే అని సూచించారు. నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లు వచ్చినా చేర్చుకోవాలని అధిష్టానం చెప్పిందని గుర్తుచేశారు.
పార్టీ హైకమాండ్ కంటే ఇక్కడ తోపులు ఎవరూ లేరు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వరకు పార్టీలో పని చేసి.. ఎన్నికల సమయంలో కొందరు బయటకు వెళ్లారని.. వాళ్ళందరిని తిరిగి పార్టీలో చేర్చుకోవాలని పీసీసీకి ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. పూర్వ కాంగ్రెస్ నేతలే కాదని.. బీఆర్ఎస్ నుంచి ఎవరు వచ్చినా చేర్చుకోవాలని సూచించినట్లు తెలిపారు. పార్టీలో ఎవరు చేరినా వారు ఎమ్మెల్యేల కిందే పనిచేయాలని అన్నారు. పార్టీలోకి చేరే వాళ్లంతా డిక్లరేషన్ ఇవ్వాలని కోరారు. జవాబుదారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. ప్రాంతీయ పార్టీలకు అవకాశవాదమే ఎజెండా.. కానీ, జాతీయ పార్టీలో అలాంటి పద్దతులు ఉండవు అని అన్నారు.