‘మాదిగలను మందకృష్ణ తప్పుదోవ పట్టిస్తున్నారు’

by Gantepaka Srikanth |
‘మాదిగలను మందకృష్ణ తప్పుదోవ పట్టిస్తున్నారు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాదిగ సామాజికవర్గాన్ని మందకృష్ణ తప్పుదోవ పట్టిస్తున్నాడని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం మండిపడ్డారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై అడ్వొకేట్‌ను పెట్టి ఫైట్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి అని గుర్తుచేశారు. ప్రధాని మోడీ, అమిత్ షాల వలన వర్గీకరణ జరుగుతుందని మందకృష్ణ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం జరగాలని తామంతా పోరాటం చేశామన్నారు. ఈ పోరాటంలో అనేకమంది యువకులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ 30 ఏళ్లు వర్గీకరణపై పోరాటం చేశాడని, అందుకు అభినందిస్తూనే ఉన్నామన్నారు.

కానీ, ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు నాంది పలకగా, వైఎస్ హయాంలోనే వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలోనూ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై మరోసారి తీర్మానం చేశారన్నారు. కానీ బీఆర్ఎస్‌కు చిత్తశుద్ధి లేక వర్గీకరణపై సుప్రీంకోర్టుకు వెళ్లలేదన్నారు. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రత్యేక న్యాయవాదిని పెట్టి వర్గీకరణపై ఫైట్ చేశాడన్నారు. ఇవేమీ చెప్పకుండా మందకృష్ణ జనాలను కన్ఫ్యూజ్ చేస్తుండన్నారు. మోడీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2014 నుండి 2024 వరకు వర్గీకరణ ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పార్లమెంట్‌లో చట్టం తీసుకువచ్చేలా మందకృష్ణ చొరవ చూపాలని కోరారు. దేశంలో ఫస్ట్ టైమ్ వర్గీకరణ తెలంగాణలో కానున్నదని సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed