‘తప్పకుండా ఇండియా కూటమి విజయం సాధిస్తుంది’

by GSrikanth |
‘తప్పకుండా ఇండియా కూటమి విజయం సాధిస్తుంది’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజల అభివృద్ధి కోసమే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి అన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. న్యాయం కోసం ప్రజలు పోరాటం చేస్తున్నారు.. మోడీ సర్కార్‌పై ఇండియా కూటమి పోరాటం చేస్తోందని అన్నారు. తప్పకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు రేపు తుక్కుగూడలో రాహుల్ గాంధీ బహిరంగ సభ ఉన్న విషయం తెలిసిందే. తుక్కుగూడను సెంటిమెంట్‌గా భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్‌. దానిలో భాగంగానే.. లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని తుక్కుగూడ నుంచి పూరించబోతోంది. ఈ సభకు AICC చీఫ్‌ ఖర్గేతో పాటు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ హాజరుకానున్నారు. స‌భ ప్రాంగ‌ణాన్ని తెలంగాణ వ్యవహారాల ఇన్‌‌చార్జ్‌ దీపాదాస్​ మున్షీ, పలువురు మంత్రులు ప‌రిశీలించారు.

Advertisement

Next Story

Most Viewed