- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Chinna Reddy: తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ

దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ఒంటెద్దు పోకడ ప్రదర్శిస్తున్నదని.. దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాల్సిందేనని.. మొదటి నుంచీ తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఆరోపించారు. శుక్రవారం బీఆర్ అంబేద్కర్ సచివాలయ మీడియా సెంటర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంపై ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోవాల్సిందే అని పేర్కొన్నారు. రాష్ట్రానికి నయా పైసా నిధులు ఇవ్వకుండా, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయడం లేదని పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు. తెలంగాణపై ప్రధాని ప్రతిసారీ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు రూ.15,000 కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్‌కు పాలన చాతకాక రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టిందన్నారు.