ఎమ్మెల్యే కోటా MLC పదవి ఆశిస్తున్నా.. మనసులోని మాట బయటపెట్టిన అద్దంకి దయాకర్

by Gantepaka Srikanth |
ఎమ్మెల్యే కోటా MLC పదవి ఆశిస్తున్నా.. మనసులోని మాట బయటపెట్టిన అద్దంకి దయాకర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణను కేటీఆర్(KTR) క్యాసినో హబ్‌(Casino Hub)గా మార్చారని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్(Addanki Dayakar) తీవ్ర విమర్శలు చేశారు. పోలీసుల ఆపరేషన్‌లో ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం బయటపడిందని అన్నారు. గురువారం అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడారు. దొంగలకు లీజుకు ఇచ్చిన వాళ్లు కూడా దొంగలే అని అన్నారు. కేసీఆర్ ఫామ్హౌస్(KCR Farmhouse)లో ఉంటే.. కేటీఆర్ డ్రగ్స్ బిజినెస్(Drug Business)లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే.. ఇష్టారీతిన దోచుకొని.. రాష్ట్రాన్ని క్యాసినో హబ్గా మార్చారని మండిపడ్డారు. పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఫామ్హౌస్(Pochampally Srinivas Reddy Farmhouse)లో జరుగుతున్న అరాచకాలకు కారణం కేటీఆరే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీగా ఉన్నా కూడా.. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్లు ఎవరికీ గుర్తే లేదని.. కేటీఆర్తో చేసిన దందాలతో మళ్లీ తెరపైకి వచ్చాడని విమర్శించారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నట్లు అద్దంకి దయాకర్ మనసులోని మాట బయటపెట్టారు. దానిపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

ఇదిలా ఉండగా.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్(Moinabad) పరిధిలోని తొల్కట్టలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారనే వార్తలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ కోడిపందేల గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు దాడులు నిర్వహించారు. మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు ఫామ్‌హౌజ్ యజమాని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.

Next Story

Most Viewed