ఎన్నికల వేళ T- కాంగ్రెస్ కీలక నిర్ణయం.. BRS, బీజేపీలను ఇరుకున పెట్టేందుకు కొత్త ఎత్తుగడ..!

by Satheesh |
ఎన్నికల వేళ T- కాంగ్రెస్ కీలక నిర్ణయం.. BRS, బీజేపీలను ఇరుకున పెట్టేందుకు కొత్త ఎత్తుగడ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ, బీఆర్ఎస్‌లు ఒక్కటేనని గత కొన్ని రోజుల నుంచి ఆ రెండు పార్టీలే ప్రజలకు స్పష్టతను ఇస్తున్నాయి. ఇరు పార్టీలు వ్యవహరించే తీరు, కార్యక్రమాలన్ని పరస్పర సహకారంతో జరుగుతున్నట్లు తెలుస్తోన్నది. బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ దగ్గర్నుంచి బీజేపీ అధ్యక్షుడి మార్పు వరకు రెండు సంఘటనలకు ఆయా పార్టీలు సహకరించుకుంటున్నాయనే ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

దీంతో ‘బీజేపీ + బీఆర్‌ఎస్​= బైబై’ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లనున్నది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సుమారు నాలుగు నెలలు గడువు మాత్రమే ఉండటంతో బీజేపీ, బీఆర్ఎస్​అంతర్గత ఒప్పందాలను కాంగ్రెస్ బయట పెట్టాలని భావిస్తున్నది. రెండు పార్టీలు ఒకటేనని వివరిస్తూ గ్రౌండ్ లెవల్‌లో ప్రజల మద్దతు కోసం పార్టీ ముందుకు సాగనున్నది.

హోర్డింగులతో ప్రచారం..

ఈ మేరకు ప్రతి గ్రామంలో ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్​పోస్టర్లు వేయనున్నది. బీజేపీ, బీఆర్ఎస్​ ఒకటేనని చెబుతూ దాదాపు 12 వేల పంచాయతీ ఆఫీసులు, మున్సిపల్ కార్యాలయాల ముందు హోర్డింగ్‌లు ప్రదర్శించనున్నారు. అంతేగాక మార్కెట్లు, షాపింగ్ మాల్స్, జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను స్పష్టంగా వివరిస్తూ ఫ్లెక్సీలు ఇతర విధానాల్లో ప్రదర్శించేందుకు కాంగ్రెస్​పార్టీ ప్లాన్ ​చేసింది.

ఈ రెండు ప్రభుత్వాలను విమర్శిస్తూనే ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాన్ని చేయనున్నది. దీనిలో భాగంగానే గాంధీభవన్‌లో కాంగ్రెస్​సోషల్ మీడియా వారియర్స్‌కు ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా కమిటీలు వేయాలని ఇప్పటికే టీపీసీసీ ప్రెసిడెంట్ డీసీసీలకు సూచించారు.

ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయా..?

గత కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్​అనే స్థాయిలో ఫైట్ కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ ప్రశ్నిస్తూ వచ్చింది. దీని ఫలితంగానే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయి. అయితే ఈ ఊపును చివరివరకు కొనసాగించడంలో బీజేపీ ఫెయిలైందనే విమర్శలు మొదలయ్యాయి. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ ​స్కామ్​లో అరెస్టు తప్పదని స్వయంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర ముఖ్య నాయకులు పదే పదే మీడియా, సభలు, సమావేశాల్లో ప్రకటించారు.

కానీ ఎలాంటి అరెస్టులు లేకపోవడంతో చివరకు రెండు పార్టీల మధ్య కాంప్రమైజ్​ జరిగిందనే విమర్శలు వచ్చాయి. పైగా ఇటీవల మంత్రి కేటీఆర్​టూర్‌తో పాటు పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల మీటింగ్‌లో బీఆర్ఎస్ ​భాగస్వామ్యం కాకపోవడంతో బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని జనాలు ఒక నిర్ధారణకు వచ్చారు. తాజాగా బీజేపీ అధ్యక్షుడిని మార్చడం వంటివన్నీ ఈ రెండు పార్టీలు ఒకటేనని సంకేతాలు ఇచ్చినట్లు అయింది.

బీఆర్ఎస్‌కు కిషన్​రెడ్డి దగ్గర వ్యక్తి అనే ప్రచారం పొలిటికల్ వర్గాలతో పాటు ప్రజల్లోనూ జరుగుతుంది. దీంతో కాంగ్రెస్‌ను సైడ్ ట్రాక్​పట్టించేందుకే ఈ రెండు పార్టీ ఇన్నాళ్లు గేమ్​ఆడినట్లు ప్రజలతో పాటు పొలిటికల్​వర్గాల్లో చర్చ షురూ అయింది. దీంతో ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వైస్​ప్రెసిడెంట్ మల్లు రవి తెలిపారు.

Read More: ఆ 50 నియోజకవర్గాలపై KCR స్పెషల్ ఫోకస్.. ప్రజల మైండ్ డైవర్ట్ కాకుండా కొత్త వ్యూహాం..!

సస్పెన్స్ కంటిన్యూ.. T-బీజేపీ చీఫ్ మార్పుపై కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠ..!

Advertisement

Next Story