- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వేయ్యి రెట్లు నయం: మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ సర్కార్ వెయ్యి రెట్టు నయం అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది కన్నా ముందే భారీ ఎత్తున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేశామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, మిల్లలకు తరలింపుపై ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశం అవున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేసేలా ధాన్యం కొనుగోళ్లలో తరుగు, తాలు పేరిట కోతలు ఎక్కడా లేవని అన్నారు. గతంలో క్వింటాకు 7 నుంచి 10 కిలోల వరకు తరుగును తిశారని ఆయన ఆరోపించారు. పంట కొనుగోలు చేసిన కేవలం ఐదు పని దినాల్లో రైతుల ఖాతాల్లో నగదును జమ చేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు.