- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గవర్నర్ ప్రసంగంలో కీలక అంశాలు.. ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్న రేపటి అసెంబ్లీ మీటింగ్?

దిశ, తెలంగాణ బ్యూరో: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉండనున్నది. అయితే ఈసారి గవర్నర్ స్పీచ్ కేంద్ర ప్రభుత్వమే టార్గెట్‌గా ఉంటుందని తెలుస్తున్నది. తెలంగాణకు నిధుల కేటాయింపులో చూపుతోన్న వివక్షను ప్రధానంగా ప్రస్తావించనున్నట్టు తెలిసింది. గత బడ్జెట్‌లో రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్రం పట్టించుకోలేదు. ఈసారి బడ్జెట్‌లో పలు రంగాలకు నిధులు కేటాయించాలని లేఖలు రాసినా, స్వయంగా మోడీ, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాలన్నింటినీ రేపు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ స్పీచ్‌లో చేర్చినట్లు తెలిసింది.
రాజకీయ కోణంలో నిధుల కేటాయింపా?
రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రంతో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. సమయం వచ్చిన ప్రతిసారీ ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరుతున్నారు. ఫ్యూచర్ సిటీ, మూసీ అభివృద్ధి, యంగ్ ఇండియా వర్సిటీకి సాయం, ఇతర పెండింగ్ అంశాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. అయినా 2025–26 కేంద్ర బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎలాంటి నిధులూ ఇవ్వలేదు. దీంతో స్టేట్ మినిస్టర్లు కేంద్రంపై ఎటాక్ చేయడం ప్రారంభించారు. సమన్యాయం చేయాల్సిన కేంద్రం రాజకీయ కోణంలో నిధులు కేటాయిస్తోందని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలపై ప్రత్యేక ప్రేమ చూపిస్తూ.. విపక్ష పాలిత రాష్ట్రానికి నిధులివ్వడం లేదని ఆరోపించారు. ఇవే అంశాలను గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ప్రసంగంలో ఉంచి కేంద్ర తీరును విమర్శిస్తూ, నిధుల కోసం అప్పీలు చేస్తారని తెలిసింది.
బీఆర్ఎస్ అప్పుల వల్లే కష్టాలు
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన ఇబ్బడి ముబ్బడి అప్పులే కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద శాపంగా మారింది. ప్రతినెలా కిస్తీలు, వడ్డీలకు సుమారు రూ.5వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. దీంతో ఇతర సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయడం రేవంత్ సర్కారుకు కష్టతరంగా మారింది. ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నా.. ఎంప్లాయిస్ జీపీఎఫ్, సరేండర్ లీవ్స్ అమౌంట్, రిటైర్డ్ ఎంప్లాయిస్ బెనిఫిట్స్ చెల్లించడం కష్టంగా మారింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను మరోసారి ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఈసారి గవర్నర్ ప్రసంగం ఉండనున్నట్టు తెలుస్తున్నది.