- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం: Ponguleti Srinivasa Reddy
దిశ,వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం సభలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. రాహుల్ గాంధీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పొంగులేటి ప్రసంగిస్తూ.. తన కష్టంలోసుఖంలో శీనన్నా మేమున్నామని ప్రజలు నాకు ధైర్యాన్ని ఇచ్చారని తెలిపారు. 2014లో తెలంగాణ బిడ్డల ఆత్మాభిమానాన్ని గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్సేనని అన్నారు. ఆరోజు యువకుల బలిదానాలు ఆపడానికి పార్టీ ప్రయోజనాలను కూడా పక్కన బెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు.
కేసీఆర్ ఆనాడు టక్కరి మాటలు చెప్పి ఇచ్చిన మాటలు తప్పారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమయిందని..వారు చేసిందేమీ లేదని అన్నారు. రైతుల పక్షపాతిని అని చెప్పి రుణమాఫీ చేయలేదన్నారు. తెలంగాణలో సుమారు 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టగానే రైతు రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు. రైతు డిక్లరేషన్‌లో ప్రకటించిన ప్రతి అంశాన్ని కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. మీ అందరి దీవెనలతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా డిక్లరేషన్ అమలవుతుందన్నారు.
కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశారన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని .. డిక్లరేషన్ లోని ప్రతి ఒక్కటీ అమలవుతుందన్నారు. సుమారు ఆరు నెలల తర్వాత నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ లో చేరానన్నారు. అనేక ప్రాంతాలు తిరిగి.. ప్రజలందరి అభిప్రాయం ప్రకారమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, తమకు మంచి జరుగుతుందని తెలంగాణ బిడ్డలు చెప్తేనే పార్టీలో చేరానని చెప్పారు.
Read More..
కాంగ్రెస్‌లో చేరాక పొంగులేటి మొదటి ప్రసంగం.. కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు