కాంగ్రెస్ గాడిద గుడ్డు Vs BJP వంకాయ.. కాషాయ పార్టీ కౌంటర్ క్యాంపెయిన్ (వీడియో)

by Disha Web Desk 4 |
కాంగ్రెస్ గాడిద గుడ్డు Vs BJP వంకాయ.. కాషాయ పార్టీ కౌంటర్ క్యాంపెయిన్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా గాడిద గుడ్డు ప్రచారాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణకు ప్రధానిమోడీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చారని సీఎం రేవంత్ సహా, కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తు్న్నారు. ఇక, తాజాగా ఈ ప్రచారానికి కౌంటర్‌గా బీజేపీ నేతలు సైతం వంకాయ ప్రచారానికి తెరలేపారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి ఇచ్చింది ‘వంకాయ’, 120 రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఇచ్చింది వంకాయ అని క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. తెలంగాణలో ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు రేవంత్ రెడ్డి వంకాయ చేతిలో పెట్టాడని బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed