- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ బడ్జెట్ రైతులను నిండా ముంచింది: మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్
దిశ, వెబ్‌డెస్క్: నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రాష్ట్ర ప్రజలను నిరాశ పరిచిందని మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.2,75,891 కోట్లలో 40 వేల కోట్లకు పై చిలుకు ఖర్చు పెట్టే ఆస్కారం లేదని.. కానీ.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూస్తుంటే.. రూ. 5 లక్షల కోట్లు ఖర్చు పెడితేనే హామీలు అమలయ్యేలా కనపడుతుందన్నారు. బడ్జెట్ లో వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు మాత్రమే కేటాయించారు.
రైతుబంధు (భరోసా) కోసం రూ. 15 వేలు.. వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామంది. ఇవన్నీ అమలు చేయాలంటే ఈ బడ్జెట్ ఎలా సరిపోతుంది. రుణమాఫీ ఈ సంవత్సరం ఉంటుందా.. లేదా..? స్పష్టత ఇవ్వలేదు. అంటే.. రైతులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు ఉత్తదేనని కనిపిస్తుంది. రాష్ట్రంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు రూ.2500 ఆర్థిక సాయం ఇస్తమని కాంగ్రెస్ ప్రకటించింది. వితంతువులకు, ఒంటరి మహిళలకు రూ.4 వేల చొప్పున ప్రతినెలా ఇవ్వాల్సి ఉంది. అయితే బడ్జెట్ లో మాత్రం ఎక్కడా నిధులు కేటాయించలేదు.
ప్రతి నిరుద్యోగికి రూ. 4 వేలు ఇస్తామనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కాంగ్రెస్ బడ్జెట్ చూస్తే ప్రజలు నవ్వుకునేలా ఉంది తప్పితే.. వారి ఆశలు నెవరేర్చేలా లేదు. రాష్ట్రంలో 52 శాతం ఉన్న బీసీ ప్రజానీకానికి ప్రతి సంవత్సరం రూ. 20 వేల కోట్ల చొప్పున ఐదేళ్ళకు గాను లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని కాంగ్రెస్ చెప్పింది. కానీ బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ. 8 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. బడ్జెట్ ను చూస్తే బీసీల అభ్యున్నతి కోసం రూపాయి ఖర్చు పెట్టే ఆస్కారం లేదని ఈటల అభిప్రాయ పడ్డారు. అలాగే.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ప్రజాక్షేత్రంలో తిరుగుబాటు తప్పదని ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.