Duty Meet-2024 : పోలీస్ అకాడమీలో డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు.. ట్రోఫీలు అందజేసిన సీఎం

by Ramesh N |
Duty Meet-2024 : పోలీస్ అకాడమీలో డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు.. ట్రోఫీలు అందజేసిన సీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని రాజ్‌బహదూర్‌ వెంకటరామిరెడ్డి పోలీస్‌ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్‌-2024 ముగింపు వేడుకలకు హాజరయ్యారు. ముగింపు వేడుకల్లో నిర్వహించిన పరేడ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కాగా, పోలీస్‌ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్‌-2024 ముగింపు వేడుకల్లో వివిధ శాఖలకు చెందిన పోలీసు బృందాలు పాల్గొన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిర్వహిస్తున్న తొలి పోలీస్‌ డ్యూటీ మీట్‌ కావడంతో పోలీస్‌ అధికారులు నాలుగు రోజుల పాటు వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు.

26 పోలీస్‌ విభాగాల నుంచి 13 బృందాలుగా ఏర్పడి పలు ఈవెంట్లు నిర్వహించారు. సైంటిఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌, డాగ్‌ స్క్వాడ్‌, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌, ఫొటో, వీడియోగ్రఫీ లాంటి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రోఫీలు అందజేశారు. అంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైబర్ క్రైమ్ సంబంధించిన హ్యాండ్‌బుక్‌ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. కాగా, విజేతలు వచ్చే జనవరిలో రాంచీలో నిర్వహించనున్న ఆలిండియా పోలీస్‌ మీట్‌లో పాల్గొనున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed