హైడ్రాకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

by M.Rajitha |
హైడ్రాకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
X

దిశ, వెబ్ డెస్క్ : సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న హైడ్రా.. ఓవైపు ఆక్రమార్కులకు నిద్ర లేకుండా చేస్తుంటే, మరోవైపు ప్రజలు హైడ్రాను స్వాగతిస్తున్నారు. ఎంతటి వారినైనా విడిచి పెట్టేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించిన తర్వాత, హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే హైడ్రాకు 139 ఫిర్యాదులు అందాయి. రోజురోజుకీ కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్న ఫిర్యాదులను అధికారులు పరిశీలించి.. అవి అక్రమ కట్టడాలు అని పూర్తిగా నిర్దారించుకున్న తర్వాతే హైడ్రా ఆయా నిర్మాణాల యజమానులకు నోటీసులు జారీ చేస్తూ.. వాటిని కూల్చివేస్తోంది. కాగా ఆదివారం కేవలం అక్రమ కట్టడాల గురించి మాత్రమే కాకుండా 115 ప్రాంతాల్లో కూలిన చెట్ల గురించి, 24 ప్రాంతాల్లో నిలిచిన వరద నీటి గురించి కూడా హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. తక్షణమే స్పందించిన హైడ్రా.. డీఆర్ఎఫ్ బృందాలను పంపి కూలిన చెట్లను తొలగించింది.

Next Story

Most Viewed