- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డయల్ 100 కు ఫిర్యాదు.. అటెండ్ చేయడానికి వెళ్లిన కానిస్టేబుల్ కు బ్రెయిన్ స్ట్రోక్..
దిశ, జడ్చర్ల: డయల్ 100కు వచ్చిన ఫిర్యాదు మేరకు అటెండ్ చేయడానికి వెళ్లిన కానిస్టేబుల్ కు బ్రెయిన్ స్ర్టోక్ వచ్చిన సంఘటన జడ్చర్ల పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా చందర్ నాయక్ విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం జడ్చర్ల పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలోని కొందరు 100 డయల్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో డయల్ 100 డ్యూటీ లో ఉన్న కానిస్టేబుల్ చందర్ నాయక్ అశోక్ నగర్ కు వెళ్లి డయల్ 100 ఫిర్యాదుదారుల ఇంటి వద్దకు వెళ్లి, విషయం తెలుసుకుంటుండగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఫిర్యాదుదారుడి ఇంటి వద్ద కుప్పకూలిపోయాడు.
ఈ విషయం పట్టణ సీఐ రమేష్ బాబుకు తెలుపడంతో ఘటన స్థలానికి వెళ్లిన సీఐ రమేష్ బాబు తన వాహనంలో జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో కానిస్టేబుల్ చందర్ నాయక్ కు పెద్ద ప్రమాదం తప్పిందని, ప్రస్తుతం చంద్ర నాయక్ ఆరోగ్య పరిస్థితి కొంతమేరకు మెరుగ్గానే ఉందని సీఐ రమేష్ బాబు తెలిపారు.