- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై డీజీపీ, ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు
దిశ, తెలంగాణ బ్యూరో: అజాదీ కా అమృతోత్సవం ఫ్రీడమ్ ర్యాలీలో భాగంగా మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరిపారని, ఆయుధ చట్టం ప్రకారం మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ మెంబర్ బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. చుట్టూ వందలాది మంది గుమిగూడి ఉండగా కానిస్టేబుల్ చేతిలో ఉన్న ఎస్‌ఎల్‌ఆర్ తీసుకుని గాల్లోకి కాల్పులు చేశారని, అదేదారిలో టీఆర్ఎస్ నాయకులు కూడా కందుకూరులో కాల్పులు చేశారని అన్నారు. ఈ ఘటనలపై రాష్ట్ర డీజీపీకి, జాతీయ మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కాల్పుల వ్యవహారం తీవ్ర కలకలం రేపడంతో తాను రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపినట్లు మంత్రి వివరణ ఇచ్చారని, జిల్లా ఎస్పీ అనుమతితోనే తాను గాల్లోకి కాల్చానని చెప్పుకొచ్చారని ధ్వజమెత్తారు. తుపాకీలో రబ్బర్ బుల్లెట్లు మాత్రమే ఉన్నాయని మంత్రి చెబుతున్నారని, మంత్రికి భద్రతగా ఉన్న సాయుధ సిబ్బంది చేతిలో ఎస్‌ఎల్‌ఆర్ తీసుకున్నట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అయిన పోలీసులు ఇంత వరకు కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. పోలీసులు ధరించే ఆయుధాలలో రబ్బర్ బుల్లెట్లు ఉండే అవకాశం ఉండదని, అవి పొరపాటున ఎవరికైనా తగిలితే ప్రాణాలు పోతాయని సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారని వివరించారు. మంత్రి రైఫిల్ అసోసియేషన్ సభ్యుడైనంత మాత్రాన తుపాకులు బహిరంగంగా ధరించకూడదని, పోలీసుల ఆయుధాలతో కాల్చడమే కాకుండా, అనవసరంగా కాల్పులు జరిపినా నేరమే అవుతుందని సీనియర్ పోలీస్‌లు స్పష్టం చేశారని పేర్కొన్నారు. జన సమర్థ ప్రాంతంలో తుపాకీతో కాల్పులు జరపడం చట్టరీత్య నేరమేనని దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో అసంఘాటీత కార్మిక కాంగ్రెస్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.