- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సమగ్ర కుల గణన సర్వేలో తెలంగాణ దేశానికి దిక్సూచి : మంత్రి పొన్నం
దిశ, కొండపాక: సమగ్ర కుల గణన సర్వే లో తెలంగాణ దేశానికి దిక్సూచి అని, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో ఎన్యుమరెటర్స్ తో కలిసి స్వయంగా సర్వే లో పాల్గొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా సర్వే ద్వారా మీ కుల బలమెంతో తెలిస్తే అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక వేయడానికి అవకాశం ఉంటుందని సర్వే కి సహకరించాలని, తెలంగాణ వ్యాప్తంగా కుల సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమగ్ర సర్వే ద్వారా ఎవరెంతో వారికంత ఆలోచనలతో తేడాలు సరిచేయడానికి ఉపయోగపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సర్వే అనారోగ్యంతో ఉన్న మనిషి లోపాలను గుర్తించడానికి ఎక్స్ రే లాగా సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి ఉపయోగపడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు, అధికారులు చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యం అయి ప్రజలు వివరాలు ఇచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు.
అంతకు ముందు దుద్దెడ గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు అని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రలలో అమ్ముకోవాలి అని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు జరగాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రైతులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజల హరికృష్ణ, జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, గజ్వేల్ ఆర్డిఓ చంద్రకళ , తహసిల్దార్ దిలీప్ నాయక్ , ఎంపిడీవో వెంకటేశ్వర్లు, కొండపాక కుకునూర్ పల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాసరి లింగరావు, విరుపాక శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆరేపల్లి మహదేవ్ గౌడ్, పిఎసిఎస్ డైరక్టర్ బూర్గుల సురేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.