- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూర్బన్ మిషన్ పనులను వెంటనే పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్
దిశ, జుక్కల్ : జుక్కల్ మండలంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేషనల్ రూర్బన్ మిషన్ పథకంలో ఆడిటోరియం పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధించిన అధికారులకు జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ ఆదేశించారు. ఆడిటోరియంలో ప్లాస్టిక్ చైర్లు వేయాలని అధికారులకు సూచించారు. ఆడిటోరియంలో మిగిలిపోయిన పనులు వెంటనే పూర్తి చేయాలని సంబంధించిన అధికారులకు ఆదేశించారు. గ్రామ మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్ పొలంలో వెళ్లి టమాట సాగును పరిశీలించారు. టమాట పంటను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. బొల్లి గంగాధర్ పొలం తిరిగి వస్తుండగా దోస్ పల్లి గ్రామానికి చెందిన వ్యక్తులు దళిత బంధు కింద వచ్చిన ఆటోను పరిశీలించారు. ఆటో నడిపితే రోజుకు ఎన్ని రూపాయలు వస్తున్నాయని కలెక్టర్ అడగ్గా.. 500 రూపాయల వరకు వస్తున్నాయని లబ్దిదారుడు చెప్పాడు.
జుక్కల్ లో ఎక్కువగా రైతులు ఉన్నారని, పంటలు సాగు చేస్తే ఎక్కువ ఆదాయం వచ్చి రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ అన్నారు. సావర్ గాం గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొంపల్లి రాములు, ఉప సర్పంచ్ భాను గౌడ్, మద్నూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాధవ దేశాయ్, జుక్కల్ ఎమ్మార్వో గణేష్, మండల అభివృద్ధి అధికారి నరేష్, అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు