తెలంగాణ-ఏపీ బార్డర్‌లో సినిమాలను తలపించేలా కోడి పందాలు సెట్టింగులు

by Mahesh |
తెలంగాణ-ఏపీ బార్డర్‌లో సినిమాలను తలపించేలా కోడి పందాలు సెట్టింగులు
X

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాలు(cockfight) పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. దీంతో గత కొన్ని ఏళ్లుగా ఈ పందాలు తెలుగు రాష్ట్రాలకు కూడా పాకుతున్నాయి. ముఖ్యంగా ఏపీతో బోర్డర్ పంచుకుంటున్న అన్ని ప్రాంతాల్లోనూ ఈ కోడి పందాలు పెద్ద మొత్తంలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజుల నుంచి ఖమ్మం సరిహద్దు ప్రాంతాల్లో(Khammam border areas) భారీ ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం సినిమా సెట్లను తలపించేలా భారీ సెట్లను ఏర్పాటు చేశారు. విసన్నపేట మండలం తాత కుంట్ల పందెం బరులు ఏర్పాటు చేయగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రముఖులు పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకొని పందాల్లో పాల్గొంటున్నారు. ఈ రోజు కోడి పందాలకు చూసేందుకు యువత పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకోవడం తో వారి కోసం భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఈ కోడి పందాల్లో పురుషులతో పాటు కొందరు మహిళలు సైతం పందాలు కాస్తున్నారు. దీంతో అక్కడ లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed