- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BRS: పార్టీ మార్పు వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: పార్టీ మారుతారని వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగాం(Jangaon) బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) ఇవాళ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. కొందరు వ్యక్తులు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, అసెంబ్లీలో సరిగ్గా మాట్లాడటం లేదని, పక్క చూపులు చూస్తున్నాడని అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. పక్క చూపులు, పై చూపులు, కింది చూపులు చూసేందుకు నేను కడియం శ్రీహరిని(Kadiyam Srihari) కాదని అన్నారు. ప్రజలు తనకు గులాబీ జెండా(Gulabi Jenda)పై ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారని, ఎవరు ఎన్ని చెప్పినా తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. అలాగే ఎవరు ఎటు పోయినా ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్(BRS Party) లోనే కొనసాగుతానని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.