Prajavani: ఇందిరమ్మ ఇండ్ల కోసం భారీగా దరఖాస్తులు

by Gantepaka Srikanth |
Prajavani: ఇందిరమ్మ ఇండ్ల కోసం భారీగా దరఖాస్తులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజావాణిలో భాగంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మొత్తంగా 3,053 దరఖాస్తులు అందగా ఇందులో ఇందిరమ్మ ఇళ్ల కోసమే 2691 దరకాస్తులు వచ్చాయి. సమస్యలు తెలిపేందుకు ప్రజలు భారీ ఎత్తున ప్రజా భవన్‌కు తరలివచ్చారు. ప్రజావాణి ఇన్‌ఛార్జి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ.చిన్నారెడ్డి ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ దరఖాస్తులలో ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చాయి.

రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం కూడా దరఖాస్తులు అందాయి. ఇందులో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 111, విద్యుత్ శాఖకు సంబంధించి 100, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 55, ఇందిరమ్మ ఇండ్ల కోసం 2,691 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 96 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్.చిన్నారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్‌కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.



Next Story

Most Viewed