- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోలీసులను కాదు.. సైనికులను తెచ్చుకో.. నోటీసులపై సీఎం రేవంత్ షాకింగ్స్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోల వ్యవహారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసుల నోటీసులపై సీఎం రేవంత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జనజాతర సభలో మాట్లాడుతూ.. అమిత్ షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారని.. అందుకే గాంధీ భవన్‌కు ఢిల్లీ పోలీసులను పంపి, నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఢిల్లీ పోలీసులను కాదు, సరిహద్దులోని సైనికులను తెచ్చుకున్న భయపడేది లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. హామీల గురించి అడిగితే నాపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని అన్నారు.
గుజరాత్ పెత్తనమా..? తెలంగాణ పౌరుషమా..? తేల్చుకుందామని సవాల్ విసిరారు. గుజరాత్ పెత్తనానికి.. తెలంగాణ పౌరుషానికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని అన్నారు. బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల అయ్యాక బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుబెట్టుకోబుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క ఓటు వేసిన అధి వృథానే అని ఎద్దేవా చేశారు. కారు కార్ఖానాకి పోయింది.. బజార్‌లో తూకానికి అమ్మమాల్సిందేనని సెటైర్ వేశారు.
Read More...
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి