CM Revanth: సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సీఎం రేవంత్ సందేశం..

by Ramesh N |
CM Revanth: సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సీఎం రేవంత్ సందేశం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహావీరుడికి నివాళి అర్పించారు. ఈ మేరకు తాజాగా ఒక సందేశం విడుదల చేశారు. శతాబ్దాల కిందటే రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పేదప్రజలను సంఘటితం చేశారు.

రాజకీయ-సామాజిక సమానత్వమే మూల సూత్రంగా గోల్కొండను ఏలిన బహుజన చక్రవర్తిగా సర్వాయి పాపన్న చరితం అసామాన్యమైనదని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. సర్వాయి పాపన్న స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం వారి ఆశయాలను కొనసాగిస్తోందని ముఖ్యమంత్రి సందేశంలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed