‘ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలియదా?’.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలియదా?’.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఇరవై ఏళ్లుగా పేదల్లో ఉన్న తనకు పేదోడి దుఃఖం తెలియదా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలియదా? ZP మెంబర్ నుంచి సీఎం అయ్యాను సీఎం రేవంత్ తెలిపారు. వాళ్లందర్నీ ఎలా ఆదుకోవాలో చెప్పండి. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు చేసింది. పేదల కోసం మరో రూ.10 వేల కోట్లు అప్పు చేద్దాం అన్నారు. కేసీఆర్‌కు 1000 ఎకరాల ఫామ్‌హౌస్ ఉంది. బీఆర్‌ఎస్ ఖాతాలో రూ.1500 కోట్లున్నాయి. అదంతా పేదల డబ్బే అని సీఎం రేవంత్ అన్నారు. అయితే ఈ నేపథ్యంలో మూసీ బఫర్ జోన్ లో ఉన్నవాళ్లు ఆందోళన చెందవద్దని సీఎం రేవంత్ సూచించారు. మూసీ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరదల నుంచి రక్షించేందుకే మూసీ ప్రక్షాళన చేపడుతున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులకు రూ.10 వేల చొప్పున కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed