- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
FPIs: యుద్ధ భయాలతో 3 రోజుల్లో రూ. 27 వేల కోట్లు ఉపసంహరించుకున్న విదేశీ ఇన్వెస్టర్లు
దిశ, బిజినెస్ బ్యూరో: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రం కావడం, ముడి చమురు ధరలు పెరగడం, చైనా మార్కెట్ల మెరుగైన పనితీరు భారత ఈక్విటీలకు ప్రతికూలంగా మారాయి. దీనివల్ల ఈ నెల మొదటివారం విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి రూ. 27,142 కోట్ల విలువైన షేర్లను విక్రయించారని గణాంకాలు వెల్లడించాయి. గత నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు తొమ్మిది నెలల గరిష్ఠంతో రూ. 57,724 కోట్లకు చేరుకున్నాయి. భారత ఈక్విటీల్లోకి విదేశీ నిధులు రావడాన్ని భౌగోళిక రాజకీయ పరిణామాలు, వడ్డీ రేట్లపై సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి. మొత్తంగా ఈ ఏడాది జనవరి, ఏప్రిల్, మే మినహా ఎఫ్‌పీఐ పెట్టుబడులు సానుకూలంగా ఉన్నాయని డిపాజిటరీల డేటా పేర్కోంది. ఈ వారం అక్టోబర్ 2న సెలవురోజు కావడంతో ఆరోజు మినహాయి అక్టోబర్ 1-4 తేదీల మధ్య చైనా మార్కెట్లు పుంజుకోవడంతో విదేశీ నిధులు వెనక్కి వెళ్లాయి. ప్రస్తుతం వాల్యూయేషన్ పరంగా చైనా మార్కెట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ కారణంతోనే భారత ఈక్విటీల నుంచి నిధులు వెనక్కి వెళ్తున్నాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా మేనేజర్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు.