అర్జున్ S/O వైజయంతి మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. హైప్ పెంచుతున్న తల్లి కొడుకుల లుక్

by Kavitha |   ( Updated:2025-04-08 14:52:21.0  )
అర్జున్ S/O వైజయంతి మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. హైప్ పెంచుతున్న తల్లి కొడుకుల లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాత(Producer)గా వ్యవహరిస్తూ పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’(Arjun S/O Vyjayanthi). ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయి మంజ్రేకర్(Sai Manjrekar) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి(Vijayashanthi) కీ రోల్ ప్లే చేస్తున్నారు.

అలాగే సోహెల్ ఖాన్(Sohail Khan), శ్రీకాంత్(Srikanth) కూడా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ‘కాంతార’(Kanthara) ఫేమ్ అజనీష్ లోక్ నాథ్(Ajaneesh Loknath) సంగీతం అందిస్తున్నారు. ఇక ఈరోజు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెడుతూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. కుర్చీలో కళ్యాణ్ రామ్ కూర్చోని చూస్తున్నాడు. అతని వెనకాలే విజయశాంతి నిలబడి సీరియస్‌గా చూస్తుంది. అలాగే చుట్టూ చాలా మంది రౌడీలు ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. కాగా ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 18న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed