Hydra : పార్టీలకు అతీతంగా ‘హైడ్రా’ కూల్చివేతలుంటాయ్: సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-08-28 09:22:53.0  )
Hydra : పార్టీలకు అతీతంగా ‘హైడ్రా’ కూల్చివేతలుంటాయ్: సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అక్రమ నిర్మాణాల కూల్చివేతలే ధ్యేయంగా.. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, బఫర్ జోన్ల పరిరక్షణే లక్ష్యంగా నెలకొల్పబడిన ’హైడ్రా‘ (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) తన పని తాను చేసుకుపోతోందని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. చెరువలను ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాల విషయంలో ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ అవతల ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైడ్రా పరిధిలో ఉన్నాయని అన్నారు. ఫామ్‌హౌజ్‌లు కట్టుకున్న సెలబ్రిటీలు మురికి నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి వదులుతున్నారని ఆరోపించారు. అందుకే కూల్చివేతలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని క్లారిటీ ఇచ్చారు.

జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ ఫామ్‌హౌజ్‌ను లీజుకు తీసుకున్నట్లుగా చెప్పారని.. ఆ లీజు విషయాన్ని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్‌లో ఎందుకు వెల్లడించలేదని ఫైర్ అయ్యారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు వెంటనే కేటీఆర్‌ను ఎమ్మెల్యేగా డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జన్వాడ ఫామ్‌హౌజ్‌కు గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు లేవని తెలిపారు. పార్టీలకు అతీతంగా హైడ్రా కూల్చివేతలు ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ నేత పల్లం రాజు నిర్మాణాన్నే హైడ్రా మొదట కూల్చిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాలపై నిత్యం మానిటరింగ్ చేస్తున్న ‘హైడ్రా’కు త్వరలోనే పోలీస్ స్టేటస్‌ను కల్పిస్తామని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.

ఒక వేళ ఎఫ్‌టీఎల్ పరిధిలో తమ కుటుంబ సభ్యుల నిర్మాణాలు ఉన్నా.. తానే దగ్గరుండి కూలగొట్టిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా 111 జీవో కూడా యథావిధిగా కొనసాగుతుందని అన్నారు. ఇక ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేసినందుకే 5 నెలల్లోనే కవితకు బెయిల్ వచ్చిందని ఆయన ఆరోపించారు. రైతు రుణమాఫీ విషయంలో ఎవరూ అధైర్యపడొద్దని..అందరికీ రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్ల వద్ద రైతుల కోసం స్పెషల్ గ్రీవె‌న్స్‌ను ఏర్పాటు చేశామని.. రుణమాఫీ కాని వారి లిస్ట్ కలెక్టరేట్‌లో ఇవ్వాలని అన్నారు. ఇప్పటికే రుణమాఫీ కింద రూ.17,933 కోట్లను రైతుల ఖాతాలో జమ చేశామని సీఎం రేవంత్ ‌రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story