- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వాయిదా
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. సీఎం రేవంత్ శుక్రవారం వరంగల్‌లో పర్యటించాల్సి ఉంది. మధ్యాహ్నం 1:30కి టెక్స్టైల్ పార్క్‌కు చేరుకుని, అనంతరం 2:10కి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలించాల్సి ఉంది. ఓరుగల్లులో మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించడంతో పాటు సాయంత్రం వరంగల్ మున్సిపల్ అధికారులతో సమీక్ష జరపాల్సి ఉంది. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ రాత్రి హైదరాబాద్‌కు చేరుకుని.. రేపు వరంగల్ పర్యటనకు వెళ్తారని అధికారులు వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ ఎన్నిక, కేబినెట్ విస్తరణపై ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. ఈ అంశం గురువారం కొలిక్కి రాకపోవడంతో రేవంత్ రెడ్డి శుక్రవారం కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వాయిదా పడింది.