Revanth Reddy : జై కిసాన్.. ఈ ప్రయత్నం నాకు గొప్ప తృప్తిని ఇస్తోంది: ఎక్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి

by Ramesh N |
Revanth Reddy : జై కిసాన్.. ఈ ప్రయత్నం నాకు గొప్ప తృప్తిని ఇస్తోంది: ఎక్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు ప్రతి క్వింటాకు రూ.500 బోనస్‌ను అమలు చేస్తోంది. దీంతో సన్నాలను సాగు చేస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎకరాకు 20-24 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. దీంతో ప్రతి ఎకరానికి ఏకంగా రూ.10-12 వేల వరకు అదనపు ఆదాయం వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.

‘1.53 కోట్ల టన్నుల వరి ధాన్యం పండించి దేశానికే అన్నపూర్ణగా తెలంగాణను నిలబెట్టిన రైతన్నకు ప్రజా ప్రభుత్వం ఇస్తోన్న ప్రోత్సాహం ఇది. ఎకరాకు రూ. 12 వేల బోనస్ ఇవ్వడం ద్వారా వ్యవ”సాయా”న్ని పండుగ చేసే ఈ ప్రయత్నం నాకు గొప్ప తృప్తిని ఇస్తోంది. జై కిసాన్’ అంటూ సీఎం రాసుకొచ్చారు.

Advertisement

Next Story