BRS ఎమ్మెల్యేలు క్షమాపణ చెబితే బాగుండేది: CM రేవంత్ రెడ్డి

by GSrikanth |   ( Updated:2024-02-17 11:14:13.0  )
BRS ఎమ్మెల్యేలు క్షమాపణ చెబితే బాగుండేది: CM రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో మేడిగడ్డ బ్యారేజీపై కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేసింది. ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడివేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తప్పులు ఒప్పుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబితే బాగుండేది అని అభిప్రాయపడ్డారు. ఇంకా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తప్పులు ఒప్పుకొని సరిచేసేందుకు సలహాలు ఇస్తే.. ఇప్పుడైనా సమాజం అభినందించేది అని గుర్తుచేశారు.

ఎదురుదాడికి దిగడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను తప్పుల తడక అంటున్నారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చింది తామే.. తెచ్చిందీ మేమే అని అన్నారు. పార్లమెంట్‌లో స్ప్రే బారిన పడింది తమ ఎంపీలే అని గుర్తుచేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు కట్టలన్నది కేసీఆర్ ఆలోచనే అని తెలిపారు. మేడిగడ్డ పాపాలకు కేసీఆర్, హరీష్ రావు ఇద్దరే కారణమని చెప్పారు. ఇదే ప్రాజెక్టును తుమ్మిడిహట్టి దగ్గరే కడితే మంచిదని ఇంజినీర్లు సిఫార్లు చేశారని అన్నారు. 151 మీటర్లతో ప్రాజెక్ట్ నిర్మించాలని పదే పదే చెప్పారు.. మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేస్తే 150 మీటర్లు అయినా మంచిదే నిర్మించారు. అంతే తప్ప మేడిగడ్డ బ్యారేజ్ నిరుపయోగం అని ఇంజినీర్లు తేల్చారని గుర్తుచేశారు. ఐదుగురు ఇంజినీర్లు బృందం స్పష్టంగా చెప్పిన విషయం ఇది అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed