- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM పదవి కావాలంటే హరీష్ రావు ముందున్న ఆప్షన్ ఇదే.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక మామ, అల్లుళ్లు(కేసీఆర్, హరీష్ రావు) ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కుట్ర పూరితంగానే పేదల ప్రభుత్వంపై కేసీఆర్, హరీష్ రావులు అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. అభివృద్ధిని పక్కనబెట్టి పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకోవడానికే కేటాయించారని అన్నారు. హరీష్ రావు సీఎం కావాలంటే.. మరో ఔరంగజేబు అవతారం ఎత్తాలని షాకింగ్ కామెంట్స్ చేశారు.
బీఆర్ఎస్ ఏనాడూ ఉద్యోగ నియామకాలపై దృష్టి పెట్టలేదని మండిపడ్డారు. నియామకాలను చేపట్టకుండా విద్యార్థుల జీవితాలతో బీఆర్ఎస్ ఆడుకుందని సీఎం విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళన చేసి.. కొత్త బోర్డును నియమించామని తెలిపారు. కాంగ్రెస్ వచ్చిన 70 రోజుల్లోనే 25వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే.. కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఒక్క మేడిగడ్డలోనే ఇంత దోపిడీ జరిగిందంటే.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాజెక్టుల్లో ఎంతమేర జరిగి ఉంటుందని ఆలోచించాలని రాష్ట్ర ప్రజలను కోరారు.