CM Revanth Reddy: తెలంగాణ గురుకుల విద్యార్థులకు కీలక పిలుపు

by Gantepaka Srikanth |
CM Revanth Reddy: తెలంగాణ గురుకుల విద్యార్థులకు కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గురుకుల విద్యార్థుల(Gurukula Students)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే మా లక్ష్యమని అన్నారు. అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. అందుకే డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచినట్లు వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 21 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం, 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని అన్నారు. దేశ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

సామాజిక న్యాయం అందించేందుకు ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహిస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్(Young India Integrated Residential Schools) నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని అన్నారు. వచ్చే అకడమిక్ ఇయర్‌లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో విద్యార్థులకు చదువుతో పాటు స్కిల్స్, ఆ స్కిల్స్‌తో ఉద్యోగాలు లభిస్తాయి. అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

టాటా ఇనిస్టిట్యూట్(Tata Institute) సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నట్లు ప్రకటించారు. సాంకేతిక నైపుణ్యంతో పాటు ప్రభుత్వం ఉద్యోగ భద్రతను కల్పిస్తోంది. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. సచివాలయం రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఉన్నత చదువులు చదివి భవిష్యత్‌లో మీరు సచివాలయంలో అడుగు పెట్టాలని.. పరిపాలనలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story